Wednesday, May 15, 2024

Breaking: 4నుంచి ఏపీలో ఒంటిపూట బ‌డులు

ఏపీలో రోజురోజుకు ఎండ తీవ్ర‌త పెరుగుతోంది. ఎండతీవ్రత దృష్ట్యా ఈనెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించాయి. మార్చి నెల నుంచే భానుడి సెగలు ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమయ్యాయి. 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఒంటి పూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ మాత్రమే పాఠశాలలను నిర్వహిస్తారు. వేసవి సెలవుల వరకూ ఒంటిపూట బడులు కొనసాగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి సురేష్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement