Monday, April 29, 2024

Congress – వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే స్వాగ‌తిస్తా – గిడుగు

విజ‌య‌వాడ – వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందిస్తూ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని చెప్పారు. రేపు ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం సమావేశమవుతోంది. ఏపీ ఎన్నికలు, ప్రస్తుత పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement