Tuesday, April 30, 2024

సీడ్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌, 100 మందికి పైగా మహిళలకు అస్వస్థత..

విశాఖ క్రైం, అచ్చుతాపురం (ప్రభన్యూస్): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఇక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం, అది మిగిల్చిన విషాదం మర్చిపోకముందే తరుచూ అచ్చుతాపురం సెజ్‌ పరిశ్రమలో వీసా వాయువు ప్రమాదాలు జరగడంతో చుట్టు-పక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఉమ్మడి విశాఖనలో ఇటీ-వల కాలంలో పారిశ్రామిక ప్రమాదాలు కార్మికులను బలిగొంటున్నాయి.ఒక్కోసారి సాధారణ ప్రజలూ ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి పరిశ్రమలకు కేంద్రమైన జిల్లాలో ఏటా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.పరవాడ, దువ్వాడ,అచ్చుతాపురం ఇండస్ట్రియ్రల్‌ ఏరియాల్లో వివిధ కర్మాగారాల్లో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..

అచ్యుతాపురం సెజ్‌ లో విషవాయువు కలకలం..అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీక్‌ తో కలకలం రేపింది. సీడ్స్‌ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 100 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వీరు వాంతులు,వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి అత్యవసరంగా ప్రథమ చికిత్స అందించారు. మరి కొందర మహిళలను అచ్చుతాపురం ఆసుపత్రుకు తరలించారు.ఈ ఏడాది మే నెల మొదటి వారంలో కూడా ఇదే ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై పెద్ద సంఖ్యలో మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడుమరోసారి లీక్‌ అవ్వడంతో 100 మందికి పైగా మహిళలు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ఇటీవలే అచ్యుతపురం ఎస్‌.ఇ.జెడ్‌ లో కలకలం రేపిన గ్యాస్‌ లీక ఘటన..ఏడాది మే నెల లోఅనకాపల్లి జిల్లాఅచ్యుతపురం ఎస్‌.ఇ. జెడ్‌ లో జరిగిన గ్యాస్‌ లీక ఘటన కలకలం రేపింది.చాలామంది కళ్ళు తిరిగి,వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు.వందలాది మంది బాధితులనుఅత్యవసర చికి కోసం అనకాపల్లిఎన్టీఆర్‌ ఆస్పత్రితో పాటు అంబులెన్స్‌ ల ద్వారా వైజాగ్‌ హాస్పిటల్స్‌ కి కూడా తరలించారు.ఆ ఘటన మరవకముందే సీడ్స్‌ కంపెనీ లో వీసా వాయవు లీక్‌ కావడంతో మరో 100 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు..

భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే ..
భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వలనే ఆయా పరిశ్రమలలోవరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అటు యాజమాన్యం ఇటు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అంటు న్నారు. ఇటీవల కాలంలోపరిశ్రమలలో భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు.ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించక పోతే చాలా నష్టం సంభవించే అవకాశం ఉంటుదని చెబుతున్నారు.???ఘటన పై మంత్రి అమర్నాధ్‌ అరాఅచ్యుతాపురం సీడ్స్‌ కంపెనీ లో జరిగిన ఘటన పై స్పందించిన ఐటీ శాఖ మంత్రి అమర్‌ నాథ్‌.జరిగిన ప్రమాద ఘటన తీరుపైఅధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement