Saturday, April 27, 2024

దేశంలోనే తొలి జాతరగా గంగ‌మ్మ జాత‌ర ప్రాముఖ్యం … సతీష్ రెడ్డి

తిరుపతి సిటీ మే 3 ( ప్రభ న్యూస్): దేశంలోనే తొలి జాతరగా గంగ‌మ్మ జాత‌ర ప్రాముఖ్యం సంత‌రించుకుంద‌ని, ఇక్కడి నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయని రక్షణ శాఖ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయాన్ని కుటుంబ సమేతంగా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనటానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి, అనంతరం నిర్మాణంలో ఉన్న ఆలయ దర్శనం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పునర్ ప్రతిష్టాపన యజ్ఞం యాగాల్లో ఉన్న ప్రధాన కలశం వద్ద వేద యంత్రం, బంగారపు యంత్రంను వేద పండితులు సతీష్ రెడ్డి చేతులమీదుగా పూజలు నిర్వహించారు. అనంతరం రక్షణ శాఖ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ… గంగమ్మ తల్లి వైభవాన్ని తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యులు చేస్తున్న కృషి చాలా అభినందనీయమ‌న్నారు.

ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తే గంగమ్మ దేవత ఆశీస్సులు అందరికీ ఉంటాయని వివరించారు. స్వయానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు గంగమ్మ దేవతకు గత 700 సంవత్సరాలుగా జాతరలో నిర్వహించుకోవడం జరుగుతున్నదని గుర్తు చేశారు. దేశంలోనే జాతర ఇక్కడ నుంచే మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయని వివరించారు. వెంకటేశ్వర స్వామి వారు తన చెల్లెలు గంగమ్మ దేవతకు సారే ఇవ్వడం ఆనవాయితీ దేశంలో ప్రతి కుటుంబంలో అక్కా చెల్లెళ్లకు సారే ఇవ్వడం మొదలైందన్నారు. ఆలయ పునరుద్ధరణ ప్రతిష్ట కార్యక్రమానికి పీఠాధిపతులు స్వరూప నంద స్వామి, విజయేంద్ర సరస్వతి పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే ముందు గంగమ్మ దేవతను దర్శించుకునే ఆచారం గుర్తుతెచ్చుకొని భక్తిశ్రద్ధలతో పూజించాలన్నారు. ఆఫ్కాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అధినేత ఎస్. రంగస్వామి ఐదు లక్షల రూపాయలను విరాళంగా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతులు ముందుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, నగర కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, ఆలయ చైర్మన్ కట్ట గోపి యాదవ్, ఈవో మునికృష్ణయ్య, పాలకమండలి సభ్యులు వెంకటేశ్వరావు, హరినాథ్ రెడ్డి, దన శేఖర్, గీత, భారతి, కార్పొరేటర్లు ఎస్కే బాబు, నగర వైసిపి అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement