Sunday, April 28, 2024

దుప్పిని చంపిన నలుగురు అరెస్టు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో దుప్పిని వేటాడి చంపి నలుగురు వ్యక్తులను గిద్దలూరు అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నింధితుల వద్ద ఉన్న చనిపోయిన దుప్పిని, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దుప్పిని వేటాడుతున్న వారిలో మరో ముగ్గురు పరారైనట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. పరారైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అటవీశాఖ అధికారి డిఎఫ్ఓ సతీష్ రాత్రి అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా

తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. దుప్పిని వేటాడుతున్న మండ్ల శ్రీను, మండ్ల సాంబయ్య, మీనిగ శేఖర్, మండ్ల వెంకట లక్ష్మీనారాయణ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని మరో ముగ్గురు నిందితులు పరారయ్యారని, వేటాడి చంపిన దుప్పిని, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడ్డ నిందితులను అటవీ శాఖ వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement