Thursday, December 7, 2023

AP: పోలీసుల అదుపులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

నంద్యాల : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఆయా దృశ్యాలను చిత్రీకరిస్తున్న భూమా అఖిలప్రియ సెల్ ఫోన్ ను పోలీసులు బలవంతంగా లాక్కోవడంపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
   

అనంతరం ఆమెను ఆళ్లగడ్డలోని ఇంటి వద్ద పోలీసులు వదిలేశారు. ఇంటి వద్దనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని అఖిలప్రియ నిర్ణయించుకున్నారు. ఇంట్లో కూర్చోబెట్టినంత మాత్రాన దీక్షను ఆపేది లేదన్నారు. నా తమ్ముడికి ఏదైనా జరిగితే అందుకు నంద్యాల ఎస్పీ, డీఎస్పీలే బాధ్యత వహించాలని అఖిల ప్రియ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement