Saturday, May 18, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యము (ఆడియోతో..)

గజానుడికి గణాధిపత్యం లభించిన వైనం…

గ ణాధిపత్యం కావాలంటే 14లోకాలలో ఉండే 350 కోట్ల తీర్థాలలో స్నానం చేసి మూడు లోకాలు ప్రదక్షిణం చేసి తన వద్దకు ముందుగా వచ్చిన వారికి గణాధిపత్యం ఇస్తానని శంకరుని ఆదేశం. తన వాహనం అల్పప్రాణి అయిన ఎలుక అని అంతవేగం, అంతదూరం ఇంత కాయాన్ని మోసుకునిపోయి ముందుగా తాను ఎలా చేరుతానని కుమారస్వామికి ఆధిపత్యం అప్పగించాలని తలచారా అంటూ గణపతి శంకరుని వద్ద వాపోయెను. కార్యసాధ కం కావాలంటే శక్త్తే కాదు భక్తి, బుద్ధి ఉంటే సిద్ధి లభిస్తుందని శంకరుడు గణపతిని ఊరడించెను.

సకృత్‌ నారాయణత్యుక్త్వా త్రీన్‌ లోకాన్‌ సంక్రమిష్యతి
సార్ధత్రికోటి: మధ్యశ్చ సద్యస్స్నాతి న సంశయ:

అని విష్ణుధర్మం చెబుతుంది. ఒకసారి నారాయణ నామాన్ని జపిస్తే మూడు లోకాలలో ఉన్న 350 కోట్ల తీర్థాలను దర్శించిన, స్పృశించిన పుణ్యం లభిస్తుందని మంత్రార్థం. నారాయణ మంత్రాన్ని పరమశివుడు గజానునికి ఉపదేశించి, ఆ మంత్రాన్ని జపి స్తూ తల్లిదండ్రులమైన తమ చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయమని చెప్పెను. గణపతి తండ్రి మాటను అక్షరాల పాటించినందున కుమారస్వామి వెళ్ళిన ప్రతీ చోట తనకంటే ముందుగా గణపతి తారసపడెను. ఆ విధంగా గజానునుడు గణాధిపతి అయ్యాడు. నారాయణ మంత్రాన్ని జపించినా తల్లిదం డ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే ఏ ఫలితమైనా దక్కుతుంది. మంత్రం, భగవంతుడి కంటే తల్లిదండ్రులే పరమపూజ్యులు, పరమ ప్రభావ సంపన్నులని గజానునికి గణాధిపత్యం ఇచ్చిన మాతాపితురుల ప్రదక్షిణం వేనోళ్ల చాటుతుంది. గణపతివలే తల్లిదండ్రులకున్న ప్రాముఖ్యాన్ని, పవిత్రతను పిల్లలు గుర్తించి వారిని ఆదరిస్తే వేలకోట్ల గణపతులను పూజించిన ఫలితం, ఆయన ఆశీస్సులు తప్పక లభిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement