Friday, May 3, 2024

Floods Fear – వ‌ర‌ద‌లొస్తే ఎలా … బిక్కుబిక్కుమంటున్న‌పోల‌వ‌రం నిర్వాశితులు

చింతూరు (అల్లూరి జిల్లా), ప్రభ న్యూస్‌:చింతూరు మన్యంలో గత ఏడాది జూలై 10 వ తేదిన ప్రారంభమైన వరద జూలై 16 అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా పెరిగి ప్రజలను పరుగులు పెట్టించింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 71.3 చేరుకొని గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చి ఉహించని ఉపద్రవాన్ని వరద తెచ్చిపె ట్టింది. మన్యంలో తెల్లారి లేచి చూస్తే వీలిన మండలాల్లో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఎటు- చూసినా వరదనీరే, ఇంట్లోని సామాన్లు సర్దుకునేంత సమయం గోదారమ్మ ఇవ్వక పోవడంతో వరద బాధితులు బ్రతుకు జీవుడా అని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోని కట్టుబట్టలతో తట్ట, బుట్ట సర్దుకొని పునరావాస కేంద్రాలకు తరలివచ్చారు. గోదారమ్మ ఊహించని వరద బీభత్సం సృష్టించడంతో ఏజెన్సీలోని ప్రజలు గోదావరి వరదను చూసి గుండెలు జల్లుమన్నాయి. వరద భీభత్సానికి ఎప్పుడు ఏం జరుగు తుందో తెలియని నిర్వాసితులు బతికి బట్ట కడతామా అనే భయాందోళనలతో తట్ట, బుట్ట సర్దుకొని కొండలు, గుట్టల ప్రాంతాలతో పాటు పునరావాస కేంద్రాలను వెతుక్కోని వెళ్లారు. ఏజెన్సీలోని గోదావరి వరదలపై కొత్తగా వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడం, వరద అంచన, నష్ట నివారణపై ఎలాంటి ముందస్తు సమీక్షా సమావేశాలు ఏర్పాటు- చేయకపోవడంతో వరదలు మన్యం ప్రజలను వణికించాయనేది మన్యం వరద బాధితుల ఆవేదన.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో సర్వస్వం కోల్పోతున్నా నిర్వాసితులను ప్రతి ఏటా వరదల్లో నిండా ముంచుతున్నా రేనేది జగమెరిగిన సత్యం. ఇలా ప్రతి ఏడాది వరదల్లో మునిగి తీవ్రంగా నష్టపోతున్న ప్రభుత్వాలు మాత్రం నిర్వాసి తుల పట్ల కనికరం చూపడం లేదు. ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రారం భం నుండి నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కోసం ప్రభుత్వాలు అనేక సర్వేలు చేసినప్పటకీ నేటీకి ఏ ఒక్క గ్రామానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లింపు లేదు అలాగే పునరావాసం కల్పించలేదనడంలో ఎటువంటి సందేహాం లేదు. చింతూరు మన్యంలోని విఆర్‌ పురం, కూనవరం మండలాల్లోని సుమారు 41.15 కాం టూర్లో 15 గ్రామాలకు గానుపరిహారం, పున రావాసంకల్పించ డాని కి 2017 వ సంవత్స రం నుండి నేటీ వరకు అనేక మార్లు సర్వేలు చేస్తూ కాలయా పన చేస్తున్నారనే తప్ప నేటీకి ఏ ఒక్క నిర్వాసిత కుటుంబాన్ని పునరావాస కేంద్రానికి తర లించిన దాఖలాలు లేవు.

పోల వరం నిర్వాసిత గ్రామాల్లో గత 8 సంవత్సరాలగా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం విఆర్‌ పురం మండ లంలోని14 గ్రా మాలకు గాను 2 వేల 1 వంద 28 కుటుంబా లకు ఆవార్డు ఇచ్చారే తప్ప ఏ ఒక్క కుటుం బాన్ని తరలించ లదు. కూనవరం మండలం లోనిబోజ్జరాయి గూ డెం గ్రా మం పరిస్థితి కూ డా ఇదే రీతిలో ఉందన డంలో ఏ సందేహాం లేదు. ఈ గ్రామంలో మొత్తం 216 నిర్వాసిత కుటుం బాలు ఉండ గా వీరిన సైతం ప్రతి ఏటా వరదల్లో ముంచుతున్నారే తప్ప తరలించేందకు మాత్రం చర్యలు చేపట్టడం పోగా చిన్న చిన్న సాంకేతిక కారణాలతో పరిహారం అందని నిర్వాసితులు సైతం లేకపోలెదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇలా ఉంటే సర్వేల పేరుతూ కాలయాపన చేస్తూ తరలిం పులో తీవ్ర జాప్యం చేస్తుండటం తో వరదలు వచ్చిన ప్రతిసారి నిర్వాసితుల పాలిట ఈ వరద లు శాపంగా మారుతున్నాయి. ప్రతి ఏడాది వరదల్లో మునుగుతున్నా ము తప్ప మాగోడు ఏ నాధుడు పట్టీంచుకోవడం లేదని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

అదిగో పరిహారం.. ఇదిగో పునరావాసం
పోలవరం ప్రాజెక్టు నిర్మా ణంలో నిర్వాసితులుగా మారిన ప్రజలను ప్రభుత్వాలు మోసపూ రిత మాటలతో కాలం గడుపుతున్నా యని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తామని 2019 వ సంవత్సరం నుండి గత 6 సంవత్సరాలుగా మండల స్థాయి తహాసీల్దార్‌ నుండి జిల్లా కలెక్టర్‌ వరకు, ఎమ్మెల్యే నుండి రాష్ట్ర మంత్రుల వరకు అదిగో పరిహారం ఇదిగో పునరావాసం అని మాయమాటలు చేపుతూ 6 సంవత్సరాలు గడేపే శారే తప్ప ఏ ఒక్క గ్రామాన్ని తర లించ లక పోయారు. మార్చి పోతే ఏప్రిల్‌ తర్వాత మే, జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో చెప్పుకుంటూ వరదలు అయ్యేంత వరకు పాడిందే పాడారా పాసిపళ్ళ భద్ర య్య అన్న చందంగా 6 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వర కు పూర్తిస్థాయిలో పరిహారం అందకపోగా పునరావాసం కూ డా కల్పించలేని పరిస్థితి దాపురించింది. అధికారులు మంత్రు లు నెల పేరు మాత్రమే ప్రకటిస్తారు, సంవత్సరం అనేది ప్రక టించరు, ఇలా నిర్వాసితులు పట్ల అధికారులు, ప్రజాప్రతి నిధులు మోసపూరిత ప్రకటనలు చేస్తూ కాలం వెెల్లదీస్తున్నారని నిర్వసితులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement