Wednesday, May 22, 2024

RRR: సినిమా విడుదల పేరుతో అభిమానుల ఓవర్ యాక్షన్

కర్నూలు నగరంలో ఏ సినిమా అయిన విడుదల నేపథ్యంలో అభిమానుల వీరంగం హద్దులు దాటుతున్నాయి. అభిమానం ఒక భాగమైతే ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది. శుక్రవారం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సంయుక్తంగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా అభిమానుల ఓవర్ యాక్షన్ తో కర్నూలు నగరంలోని బంగారు పేట శ్రీ రామ థియేటర్, రాజు థియేటర్, కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమా విడుదల బ్యానర్ ల వద్ద అభిమానులు కొలహలం చేయడం ఒక భాగమైతే…మరో పక్క ఆటోలకు ఫ్లెక్సీలు కట్టి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు టైర్ లపై ఆటోలు నిలుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు ప్రమాదం జరిగితే ఎవరు బాద్యులు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యువత అంటే సమస్యల పట్ల స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి కానీ నేటి యువత ఇతరులకు హాని కల్గించే విధంగా తప్పుడు మార్గాలను ఎంచుకుని వారి భవిష్యత్ ను పాడుచేసుకుంటున్నారని మండిపడుతున్నారు. యువతను కట్టడి చేసే విధంగా తల్లితండ్రులు క్రమశిక్షణ మార్గంలో వారిని ఎదిగేలా కృషిచేయాలనీ పోలీస్ అధికారులు అనేక సందర్భాల్లో తెలిపిన కూడా కొందరు వారి పిల్లలను కట్టడి చేయడంలో విఫలం చెందుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement