Monday, April 29, 2024

Exclusive – చెరువుల్లో ఇళ్లు .. వ‌ర‌దొస్తే అంతా మున‌కే

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో:

రాష్ట్రంలో ఇరిగేషన్‌ ఆస్తులను పెద్ద ఎత్తున ఆక్రమణదారులు కొల్లగొడు తున్నారు. చెరువులు, కాలువల్లో విలువైన మట్టిని దొంగలించుకెళ్తు న్న మాఫియాకు తోడు కొంతమంది ఆక్రమణదారులు ఏకంగా వాటిలో ఎక్కువ భాగం ఆక్రమిం చేస్తున్నారు. ఫలితంగా వరదొస్తే చెరువులను ఆక్రమించి వెలసిన ఊళ్లు, వీధులు ముంపునకు గురవుతున్నాయి. వరద నీరు చెరువులకు వెళ్లేదారిలేక ఆయా ప్రాంతా లను చుట్టుముట్టేస్తు న్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఊళ్లే చెరువులుగా దర్శనమిస్తు న్నాయి. రోజురోజుకూ చెరువులు, కాలువల పరిధిలో అక్రమ కట్టడాలు పెరిగిపో తుండడంతో వర్షాకాలం వస్తే చాలు .. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా వరదనీటిలోనే చిక్కుకుపోవాల్సి వస్తోంది. గతంలో భారీ వర్షాలు సంభవించిన సం దర్భంలోనూ లోతట్టు ప్రాంతాలకు స్వల్ప దూరంలోనే వరద కనిపించేది. అక్రమ కట్టడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలతో పాటు చెరువులు, కాలువలపై అక్ర మంగా నిర్మించిన ఇళ్లు కూడా నీటమునిగిపోతున్నాయి. గడిచిన ఐదారు సంవ త్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణల సంఖ్య క్రమేనా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం లోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 70శాతంకు పైగా చెరువుల్లో కొంతమేర ఆక్రమణకు గురికావడంతో నీటి నిల్వ సామర్థ్యం క్రమేనా తగ్గుతుంది. ఆ వరదనీరు అంతా సమీపంలోని ఊళ్లను ముంచేస్తున్నాయి. అదే విధంగా పట్టణ ప్రాంతాల పరిధిలోని ప్రధాన ఇరిగేషన్‌ కాలువలు 20 శాతంకు పైగా కుంచించుకుపోయాయి. దీంతో సామర్థ్యం మేరకు కాలువలో ప్రవాహం కష్టంగా మారుతోంది. ఫలితంగా వరదనీరు అధికంగా వచ్చిన సందర్భంలో కాలువలకు ఇరువైపులా నిర్మించిన ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

వరదొస్తే… అంతా మునకే
ప్రతిఏటా జూన్‌ చివరి వారం నుంచి అక్టోబర్‌ వరకు భారీ వర్షాలు కురుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే నవంబర్‌, డిసెంబర్‌లో కూడా తుఫాన్లు రాష్ట్రాన్ని ముంచేస్తుంటాయి. వర్షాకాలంలో భారీ వరద వచ్చిన సందర్భంలో ఆ నీటిని కాలువల ద్వారా చెరువులకు , నదుల ద్వారా ప్రాజెక్టులకు సరఫరా అయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జలవనరుల శాఖ అధికారులు ఆ దిశగా నిర్మాణాలను చేపట్టారు. దశాబ్దాల కాలంగా ఇదే విధానం సాగుతూ వస్తుంది. గతంలో ఇరిగేషన్‌ చెరువులు, కాలువలు పూర్తిస్థాయిలో వరద నీటిని తరలించడం, నింపుకునే సామర్ధ్యం కలిగి ఉండేవి. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగానే భారీ కాలువలు, చెరువులను నిర్మించారు. అయితే గడిచిన ఐదారు సంవత్సరాలుగా వాటి ఆక్రమణ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు , జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉండే గ్రామాల్లోని చెరువులైతే 50 శాతంకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆయా చెరువులకు వరద నీటిని తరలించే కాలువలు చూద్దామన్నా కొన్ని ప్రాంతాల్లో కనిపించడం లేదు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వరదల్లో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో 60శాతంకు పైగా అక్రమ కట్టడాలే కనిపిస్తున్నాయి.

చెరువుల్లా మారిపోతున్న… ఊళ్లు
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో సుమారు 5,194 మేజర్‌ చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 106 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అలాగే రెండు సీజన్‌లలో కలిపి 10.43లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు అవుతుంది. ఇక మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో సుమారు 38418 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 100 టీఎంసీలకు పైగా నీటి నిల్వ చేసే అవకాశం ఉంది. ఇక కాలువలైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి జిల్లా పరిధిలోనూ వేలాది కిలో మీటర్ల పొడవున చెరువులకు వరద నీటిని తరలించే వాగులు, వంకలు (పిల్ల కాలువలు) ఉన్నాయి. అయితే వీటిలో పట్టణ ప్రాంతాలకు సమీపంలోఉండే ఊళ్లల్లోని చెరువులు అత్యధిక శాతం ఆక్రమణకు గురవుతున్నాయి. ఫలితంగా వర్షాకాలం వచ్చిందంటే ఆయా ప్రాంతా లన్నీ ముంపునకు గురవుతున్నాయి. చిన్నపాటి వర్షం పడ్డా ఆయా ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరిపోతుంది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతా ల్లోనూ ఈ తరహా పరిస్థితులే దర్శనమిస్తున్నాయి.

చెరువుల ఆక్రమణతో… దారిమళ్లుతున్న వరద
చెరువులు , ప్రధాన కాలువలు 20 నుంచి 40 శాతంకు పైగా ఆక్రమణలకు గురికావడంతో వర్షాకాలంలో ప్రతి ఏటా ఆ నీరంతా దారిమళ్లుతుంది. దీంతో అక్రమంగా నిర్మించిన ప్రాంతాల చుట్టూ వరద నీరు చేరడంతో ఆ ఊళ్లన్నీ రోజుల తరబడి వరద నీటిలోనే ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం , తుఫాన్లు , భారీ వర్షాలు సంభవిం చినప్పుడు వారిని పునరావాస కేంద్రలకు తరలించడం తంతుగా జరుగుతూనే ఉంది. ఆ సమయంలో ప్రజలు విలువైన ఆస్తులను కోల్పోవడంతో పాటు కాలువల గట్టున నిర్మించిన అక్రమ కట్టడాలు కూడా దెబ్బతింటున్నాయి. అధికారులు వరద బాధితులకు అండగా ఉండడం, దెబ్బతిన ఇళ్లకు పరిహారాన్ని చెల్లించడం ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. దీంతో చెరువులు, కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకునే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. వరద నీటిని స్వేచ్ఛగా చెరువుల్లో నిల్వ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వరద వస్తే గతం కంటే 100 శాతం అధికంగా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చెరువులు, కాలువలు ఆకమ్రణ గురి కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు చెరువుల్లో పూర్తి సామర్థ్యం నీటిని నిల్వ చేసుకునేలా వాటి పరిధిలోని ఆక్రమణలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement