Wednesday, May 1, 2024

రేపు వైయస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి సర్వం సిద్ధం..

దేవరాపల్లి, (అనకాపల్లి జిల్లా) ప్రభ న్యూస్‌: వైయస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 63.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు. ఇవ్వాల (మంగళవారం) ఆయన విలేకరులతో మాట్లాడుతూ., ఫిబ్రవరి నెల పెన్షన్‌ మొత్తాన్ని మార్చి 1న నేరుగా లబ్ధిదారులు ఇంటి వద్ద వారి చేతికి అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి దృఢ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపు (బుధవారం) తెల్లవారుజాము నుంచే వాలంటీర్‌ పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు.

ఈ మేరకు పెన్షన్‌ కోసం ప్రభుత్వం 1754.64 కోట్లు రూపాయలు ఇప్పటికే విడుదల చేసిందని, సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెన్షనర్ల ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేస్తారన్నారు. అందుకోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానాలను అమలుతో పాటు చేస్తున్నామని, ఈ నెల నుంచి ఆధార్‌ ముఖ గుర్తింపు తోను పెన్షన్‌ పంపిణీ విధానాలను అమలు చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

అలాగే ఆర్బిఐఎస్‌ విధానమును కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. సాంకేతిక కారణాలవల్ల ఏ ఒక్కరికి పెన్షన్‌ అందలేదని ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్‌ మొత్తాలను ఐదు రోజుల్లో నూరు శాతం పంపిణీ పూర్తయ్యలా వాలంటీర్లను ఆదేశించామన్నారు. పెన్షన్‌ పంపిణీ ప్రక్రియలో 15 వేలమంది వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్స్‌, వార్డ్‌ వెల్ఫేర్‌ డెవలప్మెంట్‌ సెక్రటరీలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల డిఆర్డిఏ కార్యాలయంలోని కాల్‌ సెంటర్ల ద్వారా పంపిణీ పర్యవేక్షిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement