Saturday, May 4, 2024

AP: ప్రతి కుటుంబం ఆస్తి చదువే….సీఎం జగన్

తల్లి చదివితే, పిల్లలూ చదువు బాట పడుతారు, కుటుంబం భవిష్యత్తు తలరాత మారాలంటే మంచి చదువులే కుటుంబానికి ఆస్తిగా మారుతాయని, అందుకే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోపా పథకాల్లో వధువరూలకు కనీస విద్యార్హత నిబంధన విధించామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి సీఎంవో కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు.

ఈ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో నామమాత్రంగా ఉన్న పథకాన్ని తాము బాగు చేశామని, దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరుగుతుందని, వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికీ పిల్లలను చదివించే విషయంలో ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని నిబంధన విధించామని, ఈ పథకంలో కనీస అర్హత కచ్చితంగా తమ పిల్లల చదువును ప్రోత్సాహిస్తుందన్నారు.

- Advertisement -

18 ఏళ్లకు ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్ కు అనర్హులు కాబట్టి, ఇంటర్ మీడియట్ కోసం కాలేజీకి పంపితే అమ్మ ఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం మంచి జరుగుతుందని, అందుకే కచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా తల్లిదండ్రులు అడుగులు వేస్తారని, ఇంటర్ తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉంది. అదేమాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ లో ఇస్తున్నాం. ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపా, ప్రతి పిల్లాడూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామని సీఎం జగన్ వివరించారు.

గతంలో 40 వేలకు పరిమితమైన ఎస్సీలకు రూ.లక్షల వరకూ తీసుకుపోయాం. కులాంతర వివాహానికి రూ.1.20 లక్షల వరకు, ఎస్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకూ, కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల వరకూ తీసుకుపోయామని, . గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తుంటే దాన్ని రూ.50 వేల వరకు, కులాంతర వివాహానికి రూ.75 వేల వరకూ తీసుకు వెళ్లామని సీఎం జగన్ వివరించారు. గత ప్రభుత్వం 17,790 జంటలకు నామ్ కే వాస్తే రీతిలో ఇచ్చి… రూ.70 కోట్ల మేరకు ఎగనామం పెట్టిందని, గత ఐదేళ్లుగా 56,196 జంటలకు రూ.427 కోట్లు అందించామని, ప్రస్తుతం 10,132 జంటలకు రూ.78 కోట్లు విడుదల చేసినట్టు సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement