Sunday, April 28, 2024

పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు కోడ్ గండం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా విశాఖపట్నంలో నిర్వ హించ తలపెట్టిన గ్లోబెల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ -2023కు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారనుందన్న వాదనలు వ్యక్త మవుతున్నాయి. ఒకవైపు పెట్టు బడుల సదస్సు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ముమ్మ రంగా ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లిdలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కర్టెన్‌ రైజర్‌ నిర్వహించి పెట్టు బడిదారుల్ని ఆహ్వానించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పారిశ్రా మిక దిగ్గజాలైన రిలయన్స్‌ అధినేత అంబానీ, టాటా, మహేంద్ర గ్రూపు ఛైర్మన్లను స్వయంగా కల్సి ఆహ్వానాలు అందజేశారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామి క వేత్తలతో రోజువారీ సమావే శాలు నిర్వహిస్తున్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ పెట్టుబడుల సదస్సుకు వర్తిస్తోందా లేదా అనే మిమాంశలో ప్రభుత్వం పడింది. ఈక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిష న్‌కు లేఖ రాశారు. ఈసీ నుంచి స్పష్టత వస్తే కానీ పెట్టుబడుల సదస్సులో నెలకొన్న ఉత్కంఠ వీడే పరిస్థితులు కనిపించడం లేదు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిం చడమే ప్రధాన లక్ష్యంగా మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబెల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టింది. ఢిల్లిdలో కర్టెన్‌రై జర్‌ నిర్వహించిన ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో రోడ్‌ షోలకు ప్లాన్‌ చేసింది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వచ్చి పడింది. రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 13 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్‌, రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది.
మార్చి 13న పోలింగ్‌, 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే నెరోజుల పాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండబోతోంది. ఈక్రమంలో పెట్టుబడుల సదస్సుకు అనుమతి ఇస్తారా లేదా అన్న చర్చ నడుస్తోంది. కాగా, గ్రేటర్‌ విశాఖ కౌన్సిల్‌ సమావేశం ఈనెల 15న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో విశాఖ పెట్టుబడుల సదస్సు, గ్రేటర్‌ విశాఖ కౌన్సిల్‌ సమావేశాల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ఈసీకి లేఖ రాసిన నేపథ్యంలో కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించడానికి వీల్లేని స్పష్టం చేసిన నేపథ్యంలో కౌన్సిల్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇదే నిబంధన పెట్టుబడుల సదస్సకు వర్తిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పెట్టుబడుల సదస్సుపై ఇంత వరకు క్లారిటీ రాలేదని అధికారులు చెబుతున్నారు. పెట్టుబడుల సదస్సుకు కోడ్‌ వర్తింస్తోందని ఈసీ స్పష్టం చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ లేదా గుంటూరు ప్రాంతాలకు సదస్సును మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడో చిక్కు వచ్చిపడింది. ఢిల్లిలో కర్టెన్‌రైజర్‌ నిర్వహించిన సందర్భంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ విశాఖ ఏపీ ప రిపాలనా రాజధాని కాబోతోందని, తాను షిప్ట్‌ అవుతున్నానని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించారు. సదస్సును కాబోయే ఏపీ రాజధాని విశాఖ బ్రాండింగ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈక్రమంలో పెట్టుబడుల సదస్సు విశాఖలో కాకుండా విజయవాడ లేదా గుంటూరుకు మారిస్తే విశాఖ బ్రాండింగ్‌ దెబ్బతినే అవకాశం ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా
వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ సమ్మిట్‌-2023కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పెట్టు-బడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా యాక్షన్‌ప్లాన్‌ రూపొందిస్తోంది. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఆంధ్రప్రదేశ్‌ను వేదికలా తీర్చిదిద్దేందుకు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ యోచన. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంను తలపించేలా విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి ఈ సదస్సును వినియోగించుకొని మరిన్ని పెట్టుబడులు రాబట్టాలనే దిశగా కసరత్తు చేస్తోంది. దావోస్‌ నుంచే ఇక్కడికి అందరినీ రప్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది మే నెల్లో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పలు బడా కంపెనీలతో రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. వీటిల్లో రూ.35 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు క్యాబినేట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
ముస్తాబవుతున్న విశాఖ
విశాఖపట్నం వేదికగా మార్చి 3,4 తేదీల్లో గ్లోబెల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌, 28-29 తేదీల్లో జీ-20 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరానికి సరికొత్త హంగులు అద్దుతోంది. సుమారు రూ.130 కోట్ల వ్యయంతో ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశానికి ప్రపంచదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్కొక్క జీ-20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున, అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మార్చి 16వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి జీ-20 సమావేశాలకు ఎలాంటి ఆటంకం లేదు. పెట్టుబడుల సదస్సు నిర్వహణపై మాత్రం కోడ్‌ క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement