Thursday, April 25, 2024

భారీ వర్షాలతో 100 హెక్టార్లలో పంట నష్టం..

మామిడికుదురు,ప్రభన్యూస్ : భారీ వర్షాలతో ఇప్పటివరకు మామిడికుదురు మండల పరిధిలోని సుమారు 100 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు మండల వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్ తెలిపారు.1272 హెక్టార్లలో రైతులు వరిసాగు చేపట్టగా అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో తీరని నష్టం జరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టం జరిగిన వరి చేలను మాత్రమే యుడిపి యాప్ లో నమోదు చేయాలని విఎఏ, విఎచ్ ఏ,వీఆర్వో లకు వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement