Saturday, April 20, 2024

సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. బీజేపీకి బాల్క సుమన్ వార్నింగ్

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బల్క సుమన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై నిరాధారమైన ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోస్టులు పెడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దళిత నాయకులను అవమానించేలా పోస్టులు పెట్టే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అడిషనల్ డీజీని కోరినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న అకౌంట్లను గుర్తించి.. వారిపై సుమోటోగా కేసులు పెట్టాలని తెలిపారు. కాగా, చెన్నూరు ఎమ్మెల్యే సుమన్‌తో పాటు ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, ఆనంద్, పలువురు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement