Thursday, May 2, 2024

ధాన్యం సేకరణలో కొత్త విధానం…దళారులు లేని వ్యవస్థ..కలెక్టర్ సి హరి కిరణ్..

మండపేట : జిల్లా లో ధాన్యం సేకరణ లో కొత్త విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్ పేర్కొన్నారు.దళారులు లేని వ్యవస్థ అమలు చేస్తామని ప్రకటించారు.నేరుగా ఆర్ బి కే ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. మండపేట మండలం ఏడిద లో కలెక్టర్ హరి కిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1,018 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఈ ఏడాదికి కొత్త విధానంలో శ్రీకారం చుట్టామన్నారు.తొలుత ఏడిద గ్రామంలోని సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ హరికిరణ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయంట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఆర్డీఓ సింధు సుబ్రమణ్యంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఈ ఏడాది పది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అంచనా వేశామన్నారు. ఈ కొనుగోళ్లకు 2.5 కోట్ల గన్ని బ్యాగులు అవసరమన్నారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని ఎలా కోనాలనే దానిపై మిల్లర్లతో చర్చించినట్లు చెప్పారు. వర్షాలకు నేలకొరిగిన పంటకు సబ్సిడి కోసం ఏమ్యురేషన్‌ నిర్వహిస్తామని తెలిపారు.33 శాతం కన్నా ఎక్కువ నష్టం ఉందని చెప్పారు. దీంతో నిబంధనలు మేరకు ఇన్ పుట సబ్సిడీ వస్తుందని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్‌ ద్వారా రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు కొత్త విధానం లో రైతు శాంపిల్ ధాన్యం ఆర్ బికే కి తెస్తే సరిపోతుందని పేర్కొన్నారు. నాణ్యత ,తేమశాతం పరిశీలన అనంతరం ఆ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తామో రైతు కు సమాచారం ఇస్తామని చెప్పారు. 40 కేజీల బస్తా కు లేబర్ ఛార్జీ రూ 10, క్వింటాలు కు రూ 75 లు లేబర్ చార్జీ కింద రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ నందిగం విజయ్ కుమార్,  జిల్లా పౌరసరఫరాల శాఖ డి ఎం లక్ష్మణారెడ్డి,ఆలమురు వ్యవసాయ శాఖా ఏ డి సిహెచ్ కెవి చౌదరి, తహశీల్దార్ తంగేళ్ళ రాజేశ్వరరావు, ఎంపీ డి ఓ ఐదం రాజు, ఏడిద సర్పంచ్ బురిగ ఆశీర్వాదం, మండపేట మండల వ్యవసాయ శాఖ అధికారి బలుసు రవి,  జిల్లా సహకార అధికారి బి.కె.దుర్గా ప్రసాద్‌, ఎం ఎస్ ఓ పద్మ, డివిజనల్‌ సహకార అధికారి మిరియాల నాగభూషణం,  ఎ.ఎల్‌.ఓ జి సత్యనారాయణ, ఏడిద పంచాయతీ కార్యదర్శి ఉండమట్ల వీర్రాజు, వైసిపి నాయకులు పలివేల సుధాకర్‌, విఆర్‌వోలు , సొసైటీ సీఇఓ నామాల జగదీష్‌,సొసైటి ఛైర్‌ పర్సన్‌ రామిశెట్టి శ్రీహరి,  మండల పరిషత్ విప్‌ పసుమర్తి నాగేశ్వరరావు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement