Thursday, May 9, 2024

ముడుపులివ్వ‌లేద‌ని జీతాలు బంద్…దేవాదాయ శాఖ ఘ‌న‌కార్యం..

కాకినాడ, ఆంధ్రప్రభ: దశాబ్ధాల చరిత్ర కలిగిన కాకినాడ అన్నదానం సమా జం సిబ్బందికిగత మూడు మాసాలుగా జీతాలు ఆపేశారు. దీంతో నిత్యాన్నదానం జరిగే సత్రం లో సిబ్బంది, ఉద్యోగులు అన్నమో రామ చంద్రా అంటూ అలమ టిస్తున్నారు. ప్రభు త్వం ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడా నికి వీరిపై ఎలాంటి అవినీతి ఆరోపణల్లేవు. కానీ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కొలువు దీరిన ఓ అధికారి ఆదేశాలకు తలొగ్గి తగినన్ని ముడుపులు చెల్లించేందుకు అన్నదాన సమాజ కార్యనిర్వహణాధికారి ఇతర సిబ్బంది అంగీకరించక పోవడమే ఈ పరిస్థితికి దారితీసింది. ఇంతకీ జీతాలు నిలిపేయ మంటూ ఆదేశించిన అధికారి గతంలో అత్యంత అవినీతిపరుడిగా ముద్ర పడ్డారు. జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహి స్తున్న సమయంలో ఆయనపై ఎసిబి దాడి చేసింది.

లెక్కకు మించి ఆస్తులున్నట్లు గుర్తించింది. దీంతో ఆయన్ను ఎ సిబి అదుపులోకి తీసుకుంది. కొంతకాలం ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. కొన్నాళ్ళు జైల్లో కూడా ఆయన గడపాల్సొచ్చింది. అయితే సస్పె న్షన్‌లో ఉన్నకాలంలోనే చంద్రబాబు కక్షగట్టి తనపై తప్పుడు ఆరోపణల్తో ఎసిబిదాడులకు పురమాయిం చారంటూ ఆయన ఆరోపిం చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కీర్తించారు. దీంతో సస్పెన్షన్‌ ముగిసిన వెంటనే ఆయనకు తిరిగి దేవాదాయ శాఖలో కీలకపోస్టు లభించింది. అది కూడా ఆషామాషీ పోస్టు కాదు. అక్కడే కూర్చుని రాష్ట్రం లోని వివిధ దేవాదాయ సంస్థలకు సంబంధించిన రికార్డుల్ని తన కార్యాలయానికే తెప్పించుకుని తనిఖీలు నిర్వహించే పోస్టు. ఇలా.. రికార్డుల తనిఖీల పేరిట పలు దేవా దాయ సంస్థల్నుంచి సదరు అధికారి ముక్కుపిండి గట్టిగానే ముడుపులు వసూలు చేస్తున్నారు. అయితే ఆయన ఆదేశాలకు తలొగ్గి ముడుపులిచ్చుకోలేని సంస్థల్లోని ఉద్యోగులు కాకినాడ అన్నదాన సమాజం తరహాలో పస్తులకు గురౌతున్నారు.
దేవాదాయ శాఖలో ఇలాంటి విచిత్రాలకు కొదవలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, అశోక్‌గజపతి రాజులకు అనుకూలంగా వ్యవహరించి సింహాచలం దేవస్థానానికి చెందిన వందల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేసిన ఓ అధికారిపై ప్రభుత్వం వేటేసింది. ఆయన చర్యలపై మూడు కమిటీల్తో విచారణ జరిపించింది. ఆయన చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా ఉద్యోగమే తీసేయాలని ఓ దశలో ప్రభుత్వం భావిం చింది. కానీ సదరు అధికారి ఎవరి వద్ద ఏ మాయమంతం చేశారో గాని తిరిగి ఆయనకు తనపోస్టు తనకు తిరిగి లభించింది. ఓ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అండ పుష్కలంగా ఉండడంతో సస్పెన్షన్‌ తొలగించి నిబంధనలకు విరుద్దంగా తిరిగి అదే పోస్టులో నియామక ఉత్తర్వులు పొందారు. అంతేకాదు.. ఇప్పుడాయన కార్యాలయం నుంచి కాలు బయట పెట్టాల్సిన అవసరంలేదు. రాష్ట్రంలోని ఆలయాలు, సత్రాల రికార్డుల్ని తన కార్యాలయానికే తెప్పించుకునే అధికారం ఆయనకు లభించింది. దీంతో ఇప్పుడు ఈ అధికారులు పిలిచిన ప్రతి సారి రికార్డుల్ని భుజానవేసుకుని విజయవాడకు పరి గెత్త డం దేవాదా య శాఖ కార్యనిర్వహణాధికారులు, ఇత ర సిబ్బందికి ఓ తలనొప్పి వ్యవహారంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement