Thursday, May 2, 2024

Dusserah Celebrations – బెజ‌వాడ‌ పురవీధుల్లో హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు… మైసూరు తరహా దసరా ఉత్సవాలు…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) ఒకవైపు కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై గంగా, పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారు నదీ విహారం చేస్తుండగా, మరోవైపు నగరపురవీధుల్లో ప్రత్యేక హంస వాహనంపై అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగారు. మేల తాళాలు, వేదమంత్రాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో శ్రీ దుర్గమ్మ తల్లి సోమవారం సాయంత్రం నగర పూర వీధుల్లో విహరించారు. నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గతంలో ఎన్నడూ నిర్వహించిన విధంగా మొట్టమొదటిసారి శత చండీ యాగాన్ని ఉత్సవ కమిటీ నిర్వహించింది.

మూడు దశాబ్దాల తర్వాత విజయవాడ నగరంలో అతిపెద్ద ఎత్తున మహా శత చండి యాగంతో శరన్నవరాత్రి మహోత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు మైసూరు తరహాలో దసరా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు నగరవాసులు తరలివచ్చారు. ప్రభల ఉత్సవం సాంస్కృతిక నృత్య కార్యక్రమాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని చిన్ని హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement