Sunday, December 5, 2021

మాజీ మంత్రి అయ్య‌న్న‌పై కేసు… ఎందుకో తెలుసా…

మాజీ మంత్రి, టీడీపీ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడిపై కేసు న‌మోదైంది. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని న‌ర్సీప‌ట్నం వ‌ద్ద‌ అయ్యపాత్రుడు ధర్నాకు దిగారు. అయితే ఈ ధర్నా కాస్త పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది.

ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్‌ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. అయితే తాము అనుమతి తీసుకొనే ర్యాలీ చేపట్టామని అయ్యనపాత్రుడు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News