Wednesday, March 27, 2024

Covid-19: కమలహాసన్ ను పరామర్శించిన రజనీకాంత్

కరోనా బారిన పడిన విలక్షణ నటుడు కమలహాసన్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. తన మిత్రుడికి కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న రజనీకాంత్… కమల్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కాగా, అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. తన తండ్రి కోలుకుంటున్నారని ఆయన కుమార్తె, సినీనటి శృతిహాసన్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement