Friday, May 3, 2024

Disha SOS effect …జింబాబ్వే దేశస్తురాలు దిశ ఆప్ కు కాల్ ..అయిదు నిమిషాలల‌లో పోలీసులు ప్ర‌త్య‌క్ష్యం

విశాఖపట్నం: జింబాబ్వే దేశస్తురాలు దిశ ఆప్ కు కాల్ చేసి రక్షణ పొందిన సంఘటన విశాఖపట్నం లో చోటుచేసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చదువుతున్న జింబాబ్వే విద్యార్థిని పట్ల మరొక విదేశీయుడు అనుచితంగా ప్రవర్తించాడు.. దీంతో బాధిత విద్యార్థిని దిశా యాప్ కు కాల్ చేసి సహాయం కావాలని కోరింది. కేవలం 5 నిమిషాల వ్యవధిలో బాధితురాలి లొకేషన్ కు దిశ పోలీసులు చేరుకొని యువతికి రక్షణ కల్పించారు.


వివ‌రాల‌లోకి వెళితే, మద్దిల పాలెం లోని కృష్ణా కాలేజ్ వద్ద జింబాబ్వే విద్యార్థిని రూమ్ తీసుకొని నివాసం ఉంటోంది. జింబాబ్వేకి చెందిన ఒక యువకుడు బుధవారం అర్ధరాత్రి సమయంలో యువతి ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషించడంతో – దిశ యాప్ కు జింబాబ్వే యువతి కాల్ చేసింది.. దీంతో 5 నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. బాధిత యువతితో గొడవ పడుతూ అసభ్యంగా ప్రవర్తించిన విదేశీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి సూచన మేరకు గొడవ చేసిన యువకుడికి మువ్వలపాలెం పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో గత ఏడాది తన ఫోన్ లో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నట్టుగా జింబాబ్వే విద్యార్థిని గుర్తు చేసింది. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న తనకి దిశా యాప్ ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడిందని బాధిత యువతి స్పష్టం చేసింది. అర్ధరాత్రి సమయం అయినప్పటికీ దిశా యాప్ కు కాల్ చేసిన 5 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు రావడం పోలీస్ వ్యవస్థ ఉత్తమ పనితీరుకు నిదర్శనమని జింబాబ్వే విద్యార్థిని ప్ర‌శంసించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement