Saturday, May 4, 2024

నందికొట్కూరులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు

నందికొట్కూరు పట్టణానికి సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్ నిర్మించేందుకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నందికొట్కూరులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి పట్టణానికి కొణిదేల రహదారిలో స్థలాన్ని స్పోర్ట్స్అథారిటీ సిఈవో టి.నాగరాజు నాయుడు, శాప్ ఏఈ పి.సి.వి. రంగయ్య, చీఫ్ కోచ్ భూపతిరావులు తహశీల్దార్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 5 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు రూ.60 కోట్లతో నిర్మాణం చేపట్టే అవకాశం ఉందన్నారు. ఇక్కడ నిర్మిస్తే పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే క్రీడా కారులకు ఎంత గానో ఉపయోగపడుతుందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్న క్రీడాకారుల కోసం ఈ స్పోర్ట్స్ కాంప్లెక్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement