Tuesday, April 30, 2024

certificate of commitment award: ఎమ్మెల్యే ఆర్థర్ కు సీఎం అభినందన

నందికొట్కూర్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్’ వారి ‘సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్’ అవార్డును గురువారం అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే ఆర్థర్ ను హృదయపూర్వకంగా అభినందించారు. కరోనా కష్టకాలంలో చేసిన సేవలను గుర్తుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఎలైజర్, గౌరీ , నాగ టూరు గ్రామ వైసీపీ నాయకులు సుధాకర్ రెడ్డి  పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement