Friday, May 3, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో రాక పోకల పునరుద్ధరణ

అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ తెలిపింది.  తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగించారు. భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోంది. భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి  తిరుమల కు వెళ్లే ఘాట్ రోడ్ లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాలను అనుమతించే విషయంపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement