Thursday, May 2, 2024

కేసి కెనాల్​ కింద తగ్గుతున్న ఆయకట్టు.. కాగితాలకే పరిమితమైన ఆధునికీకరణ పనులు..

కర్నూలు , (ప్రభన్యూస్‌ బ్యూరో) సీమకు ప్రధాన సాగునీటి వనరు కేసీ కాలువ. సీమలోని బీడు భూములకు సాగునీటితో పాటు సుమారు 2 వేల గ్రామాలకుపైగా తాగునీరు అందిసున్నది ఈ కాల్వ, అటువంటి కాల్వ గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఒకప్పుడు కాలువ కింద రెండు పంటలు సాగయ్యేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కేసి రైతుల దుస్థిితిని గ్రహించి దశాబ్ధం క్రితం వందల, వేల కోట్లు ఖర్చుపెట్టి కాల్వ ఆధునికీకరణ చేపట్టినా కేసి రైతులకు మాత్రం కన్నీటి గోడు తప్పడం లేదు. నిన్నటి వరకు కాల్వ చివరి ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందేది కాదు. కానీ మూడేళ్లుగా అందుకు భిన్నంగా పరిస్థితి మారింది. ఓ వైపు వర్షభావం. మరో అధిక వర్షాలు, కేసి కాల్వకు అడుగడుగున గండ్లు, వాటిని పూడ్చేందుకు పాలకులకు ముందు చూపులేక పోవడం, కేసి రైతుల కన్నీటికి కారణంగా మారింది.

ఫలితంగా కేసి కాల్వ రైతులకు నీటి విడుదల అదిగో.. ఇదిగో అని చూపడం మినహా పాలకులు చేసిందేమి లేదు. కేసి కాల్వ ఎగువన ఉన్న కర్నాటకలో భారీ వర్షాలు కురిసి తుంగభ ద్రకు నీరు వస్తే తప్ప కేసి కాల్వకు నీరు వచ్చేది . లేని పక్షంలో ఏటా కేసి కాల్వ కింద పంటలు ఎండాల్సిందే. సాధారణంగా కేసి కాలువ కర్నూలు, కడప కాలువ 306 కి,మీ పొడవున కలిగి ఉంది. మూడు జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుగా విస్తరించి ఉంది. ఈ కాలువ పరిధిలో మొత్తం 2,65,628 ఎకరాల ఆయుకట్టు స్థిరికరించారు. ఇందులో కర్నూలు జిల్లా పరిధిలో 3738 ఎకరాలు, కడప జిల్లా పరిదిలో 93873 ఎకరాలు, నంద్యాల జిల్లా పరిదిలో 1,67,873 ఎకరాలు, తెలంగాణలో 119 ఎకరాలు స్దిరికరణ ఉంది. అయితే గత ఏడాది 2021-22లో కేసి కాలువ కింద ఖరీఫ్‌ 2.65 లక్షల ఎకరాలకు గాను 1.34 లక్షలు, ఇక రబీలో కేవలం 84వేల ఎకరాలు మాత్రమే సాగయ్యయాయి.

ఇందుకు కారణం లేకపోలేదు. గత ఏడాది ఖరీఫ్‌లో అధిక వర్షాలతో కేసి రైతులు నిండ మునగగా, ఇక రబీలో తగిన పరిణామంలో నీటి విడుదల లేని కారణంగా పంటల సాగు తగ్గిపోయింది. కేసీ కాలువ నీటి వాట 31.90 టిఎంసిలు, అయితే గత ఏడాది అధిక వర్షాల మూలంగా కేసి కాలువకు 37 టిఎంసిల నీటిని విడుదల చేశారు. వీటి ద్వార ఖరీఫ్‌, రబీలకు కలిపి 2.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. వాస్తవంగా కేసి కాలువ కింద గత ఖరీఫ్‌, రబీలకు కలిపి దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2.18 లక్షల ఎకరాలతోనే సరిపెట్టారు. ా, కేవలం 2.18 లక్షల ఎకరాలతోనే సరిపెట్టారు.

ఏటా తగ్గుతున్న ఆయకట్టు..

కేసి కాల్వకింద ప్రతి ఏటా ఆయకట్టు తగ్గిపోయేందుకు అనేక కారణాలు లేకపోలేదు. వాస్తవంగా 2009 వరదల తర్వాత కేసి కాల్వ అనేక చోట్ల దెబ్బతింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు చొరవ తీసుకొని కడప నుంచి కర్నూలు వరకు ఉపాధిహామీ, ఓడిఎస్‌ కింద పనులు చేపట్టారు. అయితే సుంకుసుల బ్యారేజ్‌తో పాటు కేసి కాల్వ పరిధిలో 0 కిలో మీటర్‌ నుంచి 30వ కిలో మీటర్‌ వరకు వరదల్లో దెబ్బతిన్న పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వరదల తర్వాత తాత్కలికంగా చేపట్టిన పనులు మినహా మెరుగు పరిచింది లేదు. ముఖ్యంగా 0 కి, మీ నుంచి 25 కిలో మీటర్‌ వరకు అనేక చోట్ల కేసి లైనింగ్‌ దెబ్బతినింది. వీటిలో అనేక చోట్ల ఇసుక మూటలు అడ్డవేసి కేసి నీటిని తరలిస్తున్నారు. ఫలితంగా కేసి కాలువకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం లేదు.

- Advertisement -

2,500 క్యూసెక్కులకే పరిమితం..

వాస్తవంగా కేసి కాల్వలో నీటి పారుదల పరిణామా డిజైన 3800 క్యూసెక్కులు. అయితే 2009 వరదల తర్వాత కర్నూలు నుంచి కడప వరకు డ్యామెజ్‌ కావడంతో కాల్వకు నీటి విడుదలను 2500 క్యూసెక్కులకే పరిమితం చేశారు. వీటివల్ల కేసి కాల్వకు నీటిని విడుదల చేసిన కేవలం కర్నూలు, నంద్యాల జిల్లాలను దాటి పోవడం లేదు. కంటీన్యూగా నీరు విడుదల చేస్తే తప్పా కడపకు చేరని పరిస్ధితి కేసి కాల్వది. ఫలితంగా ప్రతి ఏటా కర్నూలు, కడప జిల్లాలో కేసి ఆయుకట్టు బాగా తగ్గిపోతుంది. మరోవైపు దాదాపు 5 టిఎంసిల నీటి కోటాను అనంతపురం జిల్లాకు మళ్లించడం వల్ల కేసి రైతులు నష్టపోవాల్సి వస్తోంది.

మూడేళ్లుగా నిధులేవీ..?

కేసి కాల్వ నిర్వహాణకు గత మూడేళ్లుగా ప్రభుత్వం పైస విదిల్చింది లేదంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. కనీసం మెయింటెన్స్‌ ఖర్చులను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఇరిగేషన్‌ అధికారులు వాపోతున్నారు. ముఖ్యంగా సుంకేసుల బ్యారేజ్‌ 0 కి,మీ నుంచి 25వ కి, మీ వరకు కేసి కాల్వ దెబ్బతిన్న వాటిని మరమ్మత్తులు చేసింది లేదు. గత మూడేళ్లుగా రూ. 70 కోట్లతో ఒక్క ఓడిఎస్‌ పనులు మినహా కేసి పరిదిలో చేసిందేమి లేదు. చివరకు సుంకేసుల బ్యారేజ్‌ మెయింటెన్స్‌ నిమిత్తం ప్రతి ఏటా రూ. 30 లక్షలు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో గేట్ల నిర్వహాణకు సంబందించిన విద్యుత్‌ బిల్లులకే రూ. 24 లక్షలకు పైగా చెలి ్లంచాల్సి ఉంటుంది. ఇక మిగిలిన సోమ్ములో గేట్లకు గ్రీస్‌, తెగిన రోఫ్‌ల స్దానంలో కొత్తవాటికి వినియోగించాలి. అయితే గత మూడేళ్ల కాలంలో కేవలం రూ. 3 కోట్లను మాత్రమే విడుదల చేశారు. ఇక ఈ ఏటా ఓఅండ్‌ఎం కింద కూడ నిధులు ఇచ్చింది లేదు.

కాగితాలకే పరిమితమైన ఎస్‌ఐఎంపి పోగ్రాం..

ఒకప్పుడు కేసి కాలువ కింద రెండు పంటలను సాగుచేసే రైతుల ఆగచాట్లను చూసి కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఎంపి (ఫెవర్‌లైన్‌ )పోగ్రామ్‌ను తెరమీదకు తెచ్చింది. రూ. 230 కోట్ల నుంచి రూ. 500 కోట్లు వెచ్చించి కేసి కాల్వను కర్నూలు నుంచి కడప జిల్లా వరకు నాబార్డు కింద ఆధునికీకరణ చేయాలని ప్రకటించింది. ఇందులో కేంద్రం నిధులు 90 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాట కింద 10 శాతంగా నిర్ణయించారు. ఈ నిధులతో సుంకేసుల బ్యారేజ్‌తో పాటు కడప వరకు కాలువను ఆధునీకరించాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇందుకు కేంద్రం సమ్మతించినా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement