Saturday, April 20, 2024

స్టైలిష్ లుక్ లో మెరిసిన – స్టార్ హీరో ప్ర‌భాస్

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోసం ప‌లు ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానుల‌తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, సరదగా మాట్లాడటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆ పిక్స్ ను ట్విట్టర్ లో షేర్ చేయడంతో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ న్యూ లుక్ వేరీ స్టైలిష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా యంగ్ గా కనిపిస్తున్నాడంటూ ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సినిమా సినిమాకు తన బాడీలో ఛేంజ్ చూపిస్తూ వస్తున్నాడు ప్ర‌భాస్. కాగా ప్ర‌భాస్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే రానున్న రోజుల్లో ఆయన గ్లోబల్‌ స్టార్‌ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆయన మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మరో రెండు సినిమాలు ప్రారంభం కావాల్సి ఉంది. బహుబలి నుంచి ప్రభాస్ తన ఫిజికల్ ఫిట్ నెస్ పై చాలా ఫోకస్ పెడుతున్నారు. అలాగే గ్లామర్ పైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బహుబలి కోసం ఏకంగా 120 కిలోల బరువు పెరిగిన ప్రభాస్ ఆ తర్వాత వెంటనే మళ్లీ మొత్తం బరువును దించేశాడు. ఇలా సినిమా సినిమాకు తన ఫిజికల్ ఫిట్ నెస్ లో చాలా మార్పులను చూపిస్తూ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement