Wednesday, May 22, 2024

ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం…

శ్రీశైల ప్రభ న్యూస్: శ్రీశైలం ఆలయ సమీపంలోని శివాజీ గోపురం ఎదురుగల పార్కులో రక్తపుమ‌డుగులో ఉన్న మృత‌దేహ‌న్ని గుర్తించారు.. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.. అక్క‌డికి చేరుకున్న పోలీసులు మ‌ర‌ణించిన వ్య‌క్తి వివ‌రాల‌ను సేక‌రించారు.. మృతుడు ఆత్మకూరు(మం) వడ్లరామాపురం చెందిన అబ్రహం (26) సం గా గుర్తించారు..

మ‌ర‌ణ‌వార్త‌ను అత‌డి బంధువుల‌కు స‌మాచారం ఇచ్చారు.. కాగా, శ్రీశైలానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని ఆటో నడుపుతు జీవనం సాగిస్తున్నాడ‌ని బంధువులు వెల్ల‌డించారు.. అత‌డిని హ‌త్య చేసి అక్క‌డ ప‌డేసి ఉంటార‌ని భావిస్తున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement