Sunday, October 6, 2024

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో పొంగులేటి భేటి – కాంగ్రెస్ లోకి ఆహ్వానం

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మంగళవారంనాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోరారు. అయితే ఇప్పుడే పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడు నిర్ణ‌యం తీసుకోలేన‌ని వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం …

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చాలని కోరిన వారిలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.. తాజాగా బండి సంజ‌య్ ని అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి కిష‌న్ రెడ్డికి ఆ బాధ్య‌త‌ను క‌ట్ట‌బెట్టింది.. అలాగే ఈట‌ల కూడా తెలంగాణ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు.. ఈ నేప‌థ్యంలోనే రాజ‌గోపాల్ కాంగ్రెస్ లో చేరేందుకు త‌టాప‌స్తున్నారు.. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి, జూప‌ల్లిలో కాంగ్రెస్ ఘ‌ర్ వాప‌సీ పై విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు…దీనిలో భాగంగానే నేడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని క‌ల‌సి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement