Sunday, April 28, 2024

Bodhan: యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం.. బోధన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఆచన్ పల్లి ఇందూర్ పాఠశాలలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ జాబ్ మేళా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం వచ్చినటువంటి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బోధన్ నియోజకవర్గంలోని ప్రతి యువకునికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ఎన్నో ప్రైవేట్ కంపెనీలతో తాను మాట్లాడానని, సుమారు 1000 కంపెనీల వారు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

ఉద్యోగ మేళాకు ఏర్పాట్లను తమ పాఠశాల చేసిన ఇందూరు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ను అభినందించారు. ప్రస్తుతం సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆగస్టు నెలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని బోధనలు ఏర్పాటు చేసి సుమారు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయనున్నట్లు ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, బోధన్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర దేశాయ్, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ శరత్, పలువార్డుల కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement