Wednesday, May 8, 2024

ప్రయాణం.. ప్రాణ సంకటం, కంకర తేలిన రోడ్లు..

హోళగుంద, (ప్రభన్యూస్‌) : గత శతాబ్ధం కాలం నుంచి రోడ్డు నిర్మాణ పనులను ఎప్పుడెప్పుడు ప్రారభింస్తారా అని మండల ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ కలగానే మిగిలిపోతున్నది. రోడ్డ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, పనులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, సర్వే పనులు కూడా పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారభిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అతీగతీ లేకపోవడంతో రైతులు తమ పొలాల్లో సర్వే చేసి సరిహద్దులుగా గుర్తించిన రాళ్లను అడ్డంగా ఉండటంతో తొలగిస్తున్నారు.

వర్షాలు కూడా ప్రారంభం అవుతుండటంతో ఒక రోడ్డు నిర్మాణ పనులు మండల వాసులకు కల గానే మిగిలిపోనుందాని ప్రజలు చర్చించుకుంటున్నారు. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో రోడ్డుపై ప్రయాణించడానికి వాహనచోదకులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గత సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభి స్తారోనని, ప్రజలు ప్రయాణికులు, వాహనచోదకులు ఎదురుచూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement