Friday, May 17, 2024

ఈ క్రాప్ యాప్ లో పంట వివరాలు నమోదు..

ఎ. కొండూరు ప్రభన్యూస్ : మండలంలోని సన్న.. చిన్న కారు రైతులందరూ తాము సాగు చేసిన పంట వివరాలను ఆ గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పుసుల్తాన్ కోరారు. మండలంలోని రామచంద్రాపురం రైతు భరోసా కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో తాము సాగు చేసిన పంటలు వివరాలను సరిచూసుకొని.. వేలిముద్రలు వేయాలన్నారు.

రైతులు తమ వేలిముద్రలను వేయని పక్షంలో వారికి ధాన్యం కొనుగోలు గాని, పంట నష్టపరిహారంగాని , ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గాని, ఇంకా వ్యవసాయశాఖ వారు అందించే ఏ పథకాలు కాని రావన్నారు. ఇంక మండలంలో 60 శాతం మంది రైతులు వేలిముద్రలు ఇవ్వాల్సింది ఉందన్నారు. రైతుల జాబితాలను గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల వద్ద ఉన్నాయని, రైతులందరూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి వివరాలను సరిచూసుకొని వేలిముద్రలు వేయాల్సిందిగా కోరారు. ఇంకా నాలుగు రోజుల పాటు మాత్రమే గడువు మిగిలి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ ఏ. రామచంద్ర రావు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement