Saturday, May 4, 2024

Flash: ఏపీలో భారీగా పెరిగిన క్రైమ్‌ రేటు: కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020లో క్రైమ్‌ రేటు భారీగా పెరిగింది. అంతకుముందు నాలుగేళ్లతో పోలిస్తే ఆ ఏడాది నమోదైన కేసులు, క్రైమ్‌ రేటులో భారీగా పెరుగుదల కనిపించింది. దేశంలో పెరుగుతున్న నేరాలపై కేరళ ఎంపీ జోస్‌ కె.మణి బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ సమాధానం ఇచ్చారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. ఏపీలో 2019లో 1,45,751 కేసులు నమోదు కాగా.. క్రైమ్‌ రేటు 278.6గా ఉందని, 2020లో కేసుల సంఖ్య 2,38,105కి, క్రైమ్‌ రేటు 452.7కి చేరిందని మంత్రి వెల్లడించారు. కాగా, సంవత్సర కాలంలో లక్ష మంది జనాభాకు నమోదైన నేరాలను క్రైమ్‌ రేటుగా పరిగణిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement