Sunday, May 19, 2024

తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలు.. పెరిగిపోతున్న హత్యలు

తిరుపతి సిటీ ఫిబ్రవరి 6 ప్రభ న్యూస్: తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో హత్యలు పెట్రేగి పోతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా హత్యలు వరకు దారితీస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక పెద్దకాపు లేఔట్ లోని వల్లి రెసిడెన్సిలోని రూమ్ నెంబర్ 103 అద్దెకు చిత్తూరు అంబేద్కర్ నగర్ మురకంబట్టుకు చెందిన కలవగుంట అన్నాదొరై 60 కలిగిన వ్యక్తితో పాటు స్నేహితుడు ఇద్దరు కలిసి  శనివారం రాత్రి రూమ్ తీసుకున్నారు. రాత్రి 12 సమయంలో అన్నాదొరైను దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి స్నేహితుడు పరారయ్యాడు. ఆదివారం ఉదయం లాడ్జి సిబ్బంది హత్య సమాచారాన్ని పోలీసులకు అందించారు. సంఘటన స్థలానికి ఈస్ట్ డిఎస్పి మురళి కృష్ణ ఇతర పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.

లాడ్జి లో సీసీ కెమెరాలు ఎక్కడ…

తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విచ్చలవిడిగా లాడ్జీలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. ఇందులో పేకాట, మద్యం, వ్యభిచారం జోరుగా సాగుతున్నది. ఇటీవల అనేకసార్లు లాడ్జిలో హత్యలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మద్యం మత్తులో పాత కక్షల కారణంగా హత్యలు జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. సీసీ కెమెరాలు లాడ్జిలో కూడా ఏర్పాటు చేసుకున్న సంఘటన కూడా లేవు. ఏదైనా సంఘటన జరిగితే ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఇళ్ల వద్ద అపార్ట్మెంట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలు ద్వారానే ఆ కేసును ఛేదించి ఆధారాలు సేకరించే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి లాడ్జిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement