Monday, December 9, 2024

Breaking: పవన్ కళ్యాణ్‌తో క్రికెటర్ అంబటి రాయుడు భేటీ

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. రాయుడు మంగళగిరి జననసేన పార్టీ ఆఫీస్‌కి వెళ్ళారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ అయ్యారు.

ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా.. లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అంబటి రాయుడు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పది రోజుల్లోనే అంబటి రాయుడు ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కావడంతో జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement