Monday, May 6, 2024

ప్రతిపక్షం కూడా లేకుండా బడ్జెట్ సమావేశమా?:సిపిఐ రామకృష్ణ

ఏపీ ప్రభుత్వం నిన్న బడ్జెట్ సమావేశం నిర్వహించింది. అయితే ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సమావేశం నిర్వహించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రామకృష్ణ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా ఒక్కరోజులో బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో సంక్షేమం సంగతి సరే… ఏపీలో అభివృద్ధి ఊసేది అని ప్రశ్నించారు. ప్రపంచమంతా వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తుంటే ఏపీలో వైద్యరంగానికి శాశ్వత ఏర్పాట్లు ఏవని సీపీఐ రామకృష్ణ అన్నారు. దేశంలో ఏపీ విద్యారంగానికి స్థానం ఎక్కడ అని విమర్శించారు. ఏపీలో పాలకుల విధానాల వల్ల పారిశ్రామిక ప్రగతి అటకెక్కింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటాన్ని తాము హర్షిస్తున్నట్లు తెలిపారు రామకృష్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement