Saturday, December 7, 2024

జిల్లాల పెంపుపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాలి : ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల పెంపు వ్యవహారంపై.. హైకోర్టులోఈరోజు విచారణ జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా ప్రకటన రద్దు చేయాలంటూ.. హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ నోటిఫికేషన్‌ రద్దు చేయాలంటూ. గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్‌ కుమార్‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ వ్యాజ్యంపై ఈరోజు విచారణ చేపట్టింది.ఈ వ్యవహారంపై.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తుది ప్రకటన వెలువడని దృష్ట్యా.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement