Friday, April 19, 2024

FLASH: తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

TS: తెలంగాణలో రేపటి (మార్చి 15) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు. టెన్ ఎగ్జామ్స్ మే 20 వరకు జరగనున్నందున అదే ఈ విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే కానుంది.

కాగా, రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్న నేప‌థ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తొలుత ఈ నెల 16 నుంచి ఒంటి పూట బ‌డులంటూ గ‌తం ప్ర‌కటించిన ప్ర‌భుత్వం..తాజాగా రేప‌టి నుంచే (మార్చి 15) ఒంటి పూట బ‌డుల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లుగా తెలిపింది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యా శాఖ సంచాల‌కురాలు శ్రీ దేవ సేన సోమవారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.




Advertisement

తాజా వార్తలు

Advertisement