Thursday, May 2, 2024

KNL: కర్నూలులో కార్డన్ సెర్చ్… నాటుసారాపై విస్తృతంగా దాడులు

కర్నూల్ ప్రతినిధి : జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘీక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇవాళ‌ తెల్లవారుజామున కర్నూలు డీఎస్పీ విజయశేఖర్, కర్నూలు తాలుకా సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈసందర్భంగా ప్రజలతో కర్నూలు పట్టణ డీఎస్పీ విజయ శేఖర్, ట్రైనీ డీఎస్పీ భావన లు మాట్లాడుతూ… నాటుసారా తయారీ దారులపై నిరంతర నిఘా ఉంచుతామన్నారు. ఈ దాడులు మరింత ముమ్మరం చేస్తామన్నారు. నాటుసారా తయారీ, విక్రయదారులు నాటుసారా జోలికి పోకూడదన్నారు. ఎవ‌రైనా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీమూకలు, అల్లరి మూకలను హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ దాడుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి సరైన ధృవ పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 600 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో ట్రైనీ డీఎస్పీ భావన, కర్నూలు తాలుకా సిఐ శ్రీరామ్, కర్నూల్ దిశ పియస్ సీఐ కళా వెంకటరమణ, కర్నూల్ రూరల్ సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, 6 మంది ఎస్సైలు, 50 మంది పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement