Monday, May 6, 2024

TDP : చంద్రబాబు అవకాశమిస్తే చిత్తూరు జిల్లాలో పోటీ – కమెడియన్ సప్తగిరి

తిరుపతి, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవకాశమిస్తే చిత్తూరు నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నానంటూ ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు సప్తగిరి అన్నారు. సోమవారం తిరుపతి నగరంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సప్తగిరి మీడియాతో ముచ్చటిస్తూ… తాను పుట్టింది ఈ జిల్లాకు చెందిన ఐరాల అని, పెరిగింది పుంగనూరు చుట్టుపక్కల ప్రాంతాలని చెప్పారు.

రాజకీయానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సప్తగిరి జవాబిస్తూ.. టీడీపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు, లోకేష్ లు ఆదేశిస్తే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. చిత్తూరు జిల్లాలో పార్లమెంటు లేక అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement