Monday, May 20, 2024

AP | కర్నూలులో కరోనా కేసుల కలకలం.. హోం ఐసోలేషన్‌కు ఇద్దరి తరలింపు

కర్నూలు, ప్రభన్యూస్‌బ్యూరో : కరోనా కేసులు కర్నూలులో కలకలం రేపుతున్నాయి. బుద, గురు వారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలువురికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్నూలు నగరానికి చెందిన ఓ మహిళ దగ్గు.., జ్వరం, జలుబు కరోనా లక్షణాలతో జిల్లా ఆస్పత్రిలో చేరారు. ఆమెతో పాటు మొత్తం 84 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్‌ నిర్ధారణ అయినట్టు- ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెల్లడించారు. వీరిద్దరినీ హోం ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు గైకొన్నట్లు చెప్పారు.

మరో 25 స్వల్ప లక్షణాలున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా కర్నూలు నగరంలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం జనం భయాందోళనకు గురవుతున్నారు. 2020, 2021లో కూడ ఉమ్మడి కర్నూలు జిల్లాలైన నంద్యాల, కర్నూలులో కరోనా తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్లో ఢిల్లిలో జరిగిన ఓ మత సంస్ద ప్రచారంకు వెళ్లి కర్నూలుకు తిరిగి వచ్చిన చాలమందికి కరోనా పాజిటివ్‌ రావడంతో కేసుల తీవ్రతకు కారణంగా అప్పట్లో గుర్తించారు.

కరోనా తీవ్రత కారణంగా ఏకంగా కర్నూలు ప్రభుత్వ ఆసుప త్రిని కోవిడ్‌ కేంద్రంగా మార్చివేయడం గమనార్హం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌ -1 కలవరం రేపుతుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తిరిగి కర్నూలులో కరోనా కేసులు నమోదవ్వడం ప్రస్తుతం జనంలో కలవరం రేపుతోంది.

ముందస్తు అప్రమత్తత

- Advertisement -

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రాకుండా ఉండేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖతో పాటు సర్వజన ఆసుపత్రి వైద్య నిఫుణులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు కరోనాను ఎలా అధిగమించాలో జిల్లా అధికార యం త్రాంగం పక్కా ప్రణాళికను ఇప్పటికే సిద్దం చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరంలోని సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే 300 పడకల సామర్థ్యంతో ప్రత్యేకంగా కోవిడ్‌ కేంద్రంను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు- ఆదోని, ఎమ్మిగన్నూరు తదితర ప్రాంత ఆసుప త్రుల్లో కూడ అన్ని ఏర్పాట్లు- పూర్తి చేశారు.

అంతేకాదు జిల్లాలోని దాదాపు 40కి పైగా పీహెచ్‌సీల్లో సైతం కరోనా -టె-స్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు- చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసులు రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, ఆయా కేసులను హోం ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 25 మంది లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారికి ముందస్తుగా కరోనా ట్రీట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు కర్నూలు వైద్యులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో కరోనాపై సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఎలాంటి అపోహలకు పోకుండా ఇంటివద్ద ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు తెలుపుతున్నారు. కొత్త వేరియం ట్‌ జేఎన్‌-1తో ప్రాణహాని లేదని తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంద ని కర్నూలు ప్రభుత్వ ఆసుప త్రి సూపరిండెంట్‌ వెల్లడిస్తున్నారు. జిల్లాలో కరోనా కేసు లు ఇప్పటి వరకు రాలేదని, ప్రస్తుతం వచ్చిన వాటిలో కూడ అనుమానిత కేసులుగా ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. చలి తీవ్రత పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ జలుబు, దగ్గు ఉంటే ఆందోళన అక్కర్లేదన్నారు. మూడు రోజులైనా జ్వరం తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement