Friday, May 17, 2024

శ్రీకాకుళంలో రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్య సేవలు అందేలా చూడాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎంకు అందించారు. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతికలోపంతో నిలిచిపోయిందని, చల్లగాలికోసం కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని, మరో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వీరిని ఢీకొట్టడంతో కొంతమంది మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. మంచి వైద్య సేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement