Tuesday, May 7, 2024

Flash: టెస్కో గోదాంలో అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం?

వరంగల్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గీసుకొండ మండలం ధర్మారం గ్రామ పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన టెస్కో కంపెనీ గోదాంలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది 7 ఫైరింజిన్లతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో రూ.40 కోట్ల విలువైన వస్త్రాలు కాలి బూడిదైయ్యాయి. పిల్లలకు సంబంధించిన బెడ్ షీట్ క్లాతులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. గోడౌన్ కు విద్యుత్ సరఫరా లేనట్లు గుర్తించారు. ప్రమాదం వెనుక కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

గోదాంలో పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన చేనేత దుస్తులను నిల్వ ఉంచారు. వీటిని పాఠశాలలకు పంపించాల్సి ఉండగా.. కరోనా వైరస్ తీవ్రత కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో నిల్వలు గోదాంలోనే పేరుకుపోయాయి. సోమవారం రాత్రి గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఏడు ఫైరింజిన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement