Thursday, May 2, 2024

అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటా.. డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన సీఎం జగన్​

అమరావతి, ఆంధ్రప్రభ: అక్కచెల్లెమ్మలకు వైసీపీ సర్కార్‌ ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్‌ వైయస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల్లో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను శుక్రవారం విజయవాడ బెంజి సర్కిల్‌లో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మొట్టమొదట నుంచి తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 108కి ఫోన్‌ చేసిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి గర్భవతుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు అందించి, డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు కూడా వారి అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంటికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, సిజేరియన్‌ అయితే రూ.3వేలు, సహజ ప్రసవం అయితే రూ.5వేలు ఆరోగ్యఆసరా కింద విశ్రాంతి సమయంలో కూడా తోడుగా ఉండేందుకు ఈ మొత్తాన్ని అందజేస్తున్నామన్నారు. ఆమెను క్షేమంగా ఇంటి వద్ద దింపేందుకు తల్లీబిడ్డ ఎయిర్‌ కండిషన్డు వాహనాలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

గతంలో అరకొరగా వాహనాలు ఉండేవని, కొన్ని సందర్భాల్లో అవికూడా అందుబాటులో ఉండేవి కాదన్నారు. ఉన్నవాటిలో కూడా వసతులు సరిగా లేని పరిస్థితుల నుంచి పూర్తిగా మెరుగైన పరిస్థితుల్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. 104, 108 వాహనాలతో పాటు- తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను నాడు-నేడు పనులతో మెరుగుపర్చడంతో పాటు- మొత్తం ఆస్పత్రి వ్యవస్ధల రూపురేఖలు మార్చుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి(వైద్యఆరోగ్యశా) ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్‌(నాని), పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సివిల్‌ స్లఫస్‌ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఆరోగ్య కుటు-ంబసంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పలువురు ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement