Friday, May 3, 2024

AP : కడప జిల్లాకు సీఎం జ‌గ‌న్‌…

ఇవాళ సీఎం జ‌గ‌న్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. పులివెందుల, ఇడుపులపాయలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

ఉదయం కడప ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకోనున్నారు.. అక్కడి నుంచి 1 హెలికాప్టర్లో బయలు దేరి 10.40 పులి వెందులలోని భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన బయలు దేరి 10.55 గంటలకు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలు దేరి బనాన ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుని.. మధ్యాహ్నం వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ఉండనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్వై ఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం గడపనున్నారు.

ఇక, మధ్యాహ్నం డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ ను ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. సెంట్రల్బో లే వార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గాంధీ జంక్షన్ చేరుకొని జంక్షన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకొని దాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకొని ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్-1ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

అలాగే, సమ్యూ గ్లాస్ హెలిప్యాడ్ దగ్గర నుంచి సీఎం జగన్ బయలుదేరి.. ఇడుపులపాయ హెలిప్యాడ్ కు చేరుకుంటారు.. రోడ్డు మార్గాన వెళ్తూ వైఎస్సార్​ మెమోరియల్ పార్క్ దగ్గరకు చేరుకుంటారు. పార్క్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉంటారు. అ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుంటారు. ఇక, సాయంత్రం గెస్ట్ హౌస్ నుంచి బయలేదేరి ఇడుపుల పాయ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలు భోదేరిలోని సీఎం జగన్ కడప ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. కడప ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement