Thursday, May 2, 2024

AP : ఇవాళ కూటమి ఉమ్మడి సమావేశం…

టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూటమి ఉమ్మ‌డి ఇవాళ స‌మావేశం కానుంది. మూడు పార్టీల‌కు చెందిన అగ్ర‌నేత‌లుభేటి అవ్వ‌నున్నారు. ఉదయం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేసే అవకాశం ఉంది. ఇక, మూడు పార్టీల అగ్రనేతల సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం పాల్గొనబోతున్నారు.

- Advertisement -

అయితే, ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ – పవన్ కళ్యాణ్ మధ్య ఓ సారి సమావేశం అయ్యారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన – బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై ఇరువురు చర్చించారు. పాడేరు, విశాఖ నార్త్, పి. గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, కైకలూరు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బీజేపీ ప్రతిపాదనను తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక, ప్రతిపాదిత స్థానాల్లో నుంచి ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేసే ఛాన్స్ ఉండగా.. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ – జనసేన వచ్చినట్లు టాక్. ఇవాళ చంద్రబాబుతో కూడా జరిగే భేటీలో సీట్ల సర్దుబాటుపై గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కల్యాణ్ చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement