Tuesday, December 3, 2024

మనబడి నాడు–నేడు పథకం.. విద్యార్ధులకు అంకితం చేయనున్న సీఎం

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం పర్యటించనున్నారు. నాడు – నేడు తొలిదశలో అభివృద్ధి చేసిన స్కూళ్లను ప్రజలకు ముఖ్యమంత్రి అంకితం చేయనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకూ అక్కడే శ్రీకారం చుట్టనున్నారు.  విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్నారు.  పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్లో బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు పి. గన్నవరం మండలం పోతవరం చేరుకుంటారు. అక్కడినుంచి పి.గన్నవరం జెడ్పీపీ హైస్కూల్‌కు చేరుకుని నాడు–నేడు పైలాన్‌ ఆవిష్కరించిన అనంతరం స్ధానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పోతవరం నుంచి బయల్దేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement