Sunday, December 8, 2024

ఏపీకి రానున్న స్పీకర్ ఓం బిర్లా

రెండు రోజుల పర్యటన నిమిత్తం లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా సోమవారం ఏపీకి రానున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. 1.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. అనంతరం తిరుమల శ్రీకృష్ణ వసతి గృహంలో స్పీకర్ ఓం బిర్లా బస చేస్తారు. మంగళవారం ఉదయం విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శానానంతరం పద్మావతి వసతి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్షించనున్నారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలను సందర్శించిన తర్వాత.. తిరుపతి కపిలేశ్వర స్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ఓం బిర్లా దర్శించుకుంటారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement