Thursday, May 2, 2024

CM Jagan: కడపలో రెండో రోజు సీఎం పర్యటన ఇలా..

ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం 9.05 గంటలకు వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పార్క్‌లో ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖిలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మార్కెట్‌ యార్డుకు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాణితోపు సమీపంలో ఆక్వాహబ్‌ ప్రారంభోత్సవం చేస్తారు. సాయంత్రం 5.05 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.

ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా రేపు(శనివారం) పులివెందుల భాకరాపురం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటుచేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ను ప్రారంభిస్తారు. అనంతరం కడప పర్యటన ముగించుకుని తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

 కాగా, గురువారం(డిసెంబర్ 23) ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. 5వందల 16 కోట్లతో.. మొత్తం 8 అభివృద్ధి పనులకు జగన్‌ శంకుస్థాపన చేశారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌ని ప్రారంభించారు. తర్వాత.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఇక.. బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీకి చేరుకుని.. అక్కడ ఆర్డీవో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్‌. తర్వాత సెంచరీ ప్లై పరిశ్రమను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement