Saturday, May 4, 2024

మత్సకారులకు సిఎం ఉపాధి భరోసా: మేయర్

రాష్ట్రంలోని మత్స్యకారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉపాధి భరోసా కల్పిస్తున్నారని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు.ఆదివారం 39వ వార్డు మామిదలపాడు శివార్లలో జాతీయ మత్సకార అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) వారి 40% రాయితీతో నూతనంగా నిర్మించిన చేపల ఉత్పత్తి కేంద్రంను బి.వై. రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ప్రారంభించారు.ముందుగా ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పోషక ఆహార పదార్థాలైన చేపలు, రొయ్యలు వంటివి ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ వాటి సరఫరా లేకపోవడంతో ప్రజలకు పోషక ఆహారం అందడం లేదన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఫిష్ ఆంధ్ర – ఫిట్ ఆంధ్ర అనే ఒక కార్యక్రమంతో మత్సకారులకు, ఆక్వా రైతులకు ఉపాధి భరోసా కల్పిస్తూ రాష్ట్రంలో 70కి పైగా ఆక్వా హబ్ లను ఏర్పాటు చేసిన వాటికి అనుసంధానిస్తూ చేపల ఉత్పత్తి కేంద్రాలు, రిటైల్ అవుట్ లెట్లు, సూపర్ స్టోర్స్, డైలీ స్టోర్స్, మొబైల్ యూనిట్స్, మిని స్టోర్స్ ను ఏర్పాటు చేశారన్నారు.వీటితో పాటు చేపలతో పాటు చేపలతో చేసిన వంటలను ఆన్లైన్ ద్వారా విక్రయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు.

ఇందులో మత్సకారుల్లోని ఔత్సాహికులను ప్రొత్సహించేందుకు ఎన్.ఎఫ్.డి.బి. ద్వారా 40% రాయితీ వచ్చేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోన్నారన్నారు.ప్రస్తుతం నిర్మించిన ఈ చేపల ఉత్పత్తి చేపల ఉత్పత్తి కేంద్రం రూ.92.40 లక్షలతో నిర్మించారన్నారు.కార్యక్రమంలో మత్సకార ఉప సంచాలకులు శ్యామలమ్మ, మత్సకార అధికారులు రాజేష్, ఆంజనేయులు, కర్నూలు జెడ్పీటీసీ ప్రసన్నకుమార్, నాయకులు అవిన్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, అనోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement