Friday, April 26, 2024

AP: అంతర్వేది స్కూల్​ స్టూడెంట్​ ఘటన.. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

క్లాస్​ రూంలో అల్లరి చేస్తూ, బూతులు మాట్లాడుతున్నాడనే కారణంగా 5వ తరగతి చదవి ఓ స్టూడెంట్​ని చెత్తకుండీలో కూర్చోబెట్టి మూతపెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్​లో జరిగింది. ఆ స్టూడెంట్​కి శిక్షగా స్కూల్​ టీచర్​ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంబేద్కర్​ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తింది. పాఠశాలలోని చెత్త కుండీలో సుమారు 45 నిమిషాల పాటు మూత పెట్టి బలవంతంగా కూర్చోబెట్టడంపై విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి.

క్లాస్‌రూమ్‌లో వేరొకరు చేసిన తప్పుకు తనను నిందించారని, శిక్షించి చెత్తకుండీలో కూర్చోబెట్టారని విద్యార్థి కన్నీరుమున్నీరు అయ్యాడు. చివరకు తన సోదరి వచ్చి మూత తెరవడంతో ఆ విద్యార్థి బయటికి వచ్చాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘం నాయకులు, వైసీపీ నేతలు ఆందోళనకు దిగాయి. ఆల్విన్‌ బాబా అనే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేశారు. ఉపాధ్యాయుడిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలని కోరారు. కాగా, విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement